Eluru: అంగన్వాడీలో అంధకారం కరెంట్ లేదు.. స్లాబ్ నిలవదు!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం చాగరపల్లిలో అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరింది. స్లాబ్ పెచ్చులు ఊడుతున్నా పట్టించుకోని అధికారులు.
Eluru: అంగన్వాడీలో అంధకారం కరెంట్ లేదు.. స్లాబ్ నిలవదు!
ఏలూరు జిల్లా: వేలేరుపాడు మండల పరిధి చాగరపల్లిలోని అంగన్వాడీ కేంద్రం సొంత భవనం శిథిలావస్థకు చేరడంతో అదే గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి అద్దెకు తీసుకున్న అంగన్వాడి భవనం నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. సుమారు 7 మందికి పైగా చిన్నారులు వచ్చే అంగన్వాడీ కేంద్రంలో స్లాబ్ పెచ్చులుడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, వర్షాకాలంలో స్లాబ్ నుంచి వర్షపు నీరు సైతం అంగన్వాడి కేంద్రంలోకి వస్తున్నాయని, పలుచోట్ల స్లాబ్ నుంచి పెచ్చులు పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ భవనం కూడా శిథిలస్థితికి చేరి రేపో మాపో కూలిపోయే ప్రమాద స్థితిలో ఉండడం ఉంది. కనీసం విద్యుత్తు సౌకర్యం కూడా లేకపోవడంతో చిన్నారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రామం ముంపులో ఉండటంతో నూతన భవన నిర్మాణం చేపట్టడం లేదు. శిథిలావస్థకు చేరిన భవనం కనుక ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నందున అధికారులు స్పందించి అంగన్వాడి కేంద్రాన్ని మరో అద్దె భావనం మార్చి పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.గ్రామంలో ఈ భవనం తప్ప మరో ఇల్లు అద్దెకు దొరకట్లేదని సిబ్బంది తెలపడంతో ఏ ప్రమాదం వాటిల్లుతుందని పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోని అంగన్వాడీ కేంద్రానికి మరమ్మతులు చేయించాలని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదం జరిగే వరకు చూడకుండా ముందే చర్యలు తీసుకుంటే జరిగే నష్టాన్ని అరికట్టవచ్చని స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.




