Nellore: జంట హత్యలతో వణికిన నెల్లూరు.. పక్కా ప్లాన్‌తోనే దుండగుల అటాక్!

Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం వద్ద జంట హత్యలు. కుందుర్తి వెంకటేష్, బాల వెంకయ్యలను కిరాతకంగా నరికి చంపిన దుండగులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 9:41 AM IST
Nellore
X

Nellore: జంట హత్యలతో వణికిన నెల్లూరు.. పక్కా ప్లాన్‌తోనే దుండగుల అటాక్!

నెల్లూరు జిల్లా: కొడవలూరు మండలం గండవరం వద్ద దారుణ ఘటన జరిగింది. వడ్డిపాలెం మెయిన్ రోడ్డులో, ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. పెద్ద పుత్తెడు గ్రామానికి చెందిన కుందుర్తి వెంకటేష్ (29), వెంగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన బాల వెంకయ్య (27) గా గుర్తించారు. వరి కోత మిషన్ కు రాత్రివేళ డీజిల్ తీసుకెళుతుండగా, దారి కాచి దుండగులు దారుణానికి వడిగట్టినట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

పెదపుత్తేడు గ్రామంలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జంట హత్యల సమాచారం తెలుసుకున్న కొడవలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, విచారణ ప్రారంభించారు. జంట హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కొడవలూరు పోలీసులు తెలిపారు. గ్రామంలో గతంలో జరిగిన వివాహేతర సంబంధాల గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story