Nellore: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి!
Nellore: కలువాయి, కుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డాక్టర్ ఎ. ఉమామహేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Nellore: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి!
Nellore: హాస్పిటల్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డాక్టర్ ఎ .ఉమామహేశ్వరి తెలిపారు, ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కలువాయి, కుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు, రోగులకు అందిస్తున్న ఆరోగ్య సేవలు గురించి సమీక్ష చేసి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు.
అవుట్ పేషంట్ ప్రతిరోజు 50 మందికి తగ్గకుండా సేవలందించాలని మరియు సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు, గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ తప్పకుండా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) కార్డు అందించాలన్నారు , ఈ కార్డు ద్వారా దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఉచితంగా ఆరోగ్య సేవలు తీసుకోవచ్చునని తెలిపారు.
ఆరోగ్య సేవ కార్యక్రమాల పైన నిర్దేశించిన లక్ష్యాలు సాధన కొరకు వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించి లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు, ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే మరుగుదొడ్లు మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు, కలువాయి,కుల్లూరు వైద్య మరియు ఆరోగ్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమం లో డాక్టర్ శ్రీధర్, ఆరోగ్య విస్తరణాధికారి అలీం, బాలకొండయ,డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.




