అజ్ఞాతం వీడిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య.. సిట్ విచారణకు హాజరు!

ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించిన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 16 March 2026 12:22 PM IST
అజ్ఞాతం వీడిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య.. సిట్ విచారణకు హాజరు!
X

అజ్ఞాతం వీడిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య.. సిట్ విచారణకు హాజరు!

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించిన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితురాలిగా (A2) ఉన్న వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడారు. హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఆమె సిట్ (SIT) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

హైకోర్టు షరతులతో కూడిన ఊరట

గత కొంతకాలంగా పరారీలో ఉన్న లక్ష్మీదుర్గపై రాజమహేంద్రవరం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో ఆమె రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆమెకు షరతులతో కూడిన వెసులుబాటు కల్పించింది. ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం విచారణకు సహకరించాలని ఆదేశించడంతో, ఆమె నేడు అధికారుల ముందుకు వచ్చారు.

హత్య జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలో లేనని, బంధువులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లానని లక్ష్మీదుర్గ గతంలో వాంగ్మూలం ఇచ్చారు. అయితే సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలను, ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా ఆమె చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది.

హత్య జరిగిన రాత్రి ఆమె అనంతబాబుతోనే ఉన్నారని, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసే సమయంలో కూడా ఆమె పాత్ర ఉందని ఫోరెన్సిక్ నివేదికలు మరియు డిజిటల్ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కీలక ఆధారాల నేపథ్యంలోనే పోలీసులు ఆమెను A2గా చేరుస్తూ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశారు. నేటి విచారణలో సిట్ అధికారులు ఆమెను మరిన్ని కోణాల్లో ప్రశ్నించే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story