Reddy Shanti: కూటమికి పోర్టుల మీద ఉన్న శ్రద్ధ.. అభివృద్ధి మీద లేదా?

Reddy Shanti: మూలపేట పోర్టు పనులపై కూటమి ప్రభుత్వం డప్పు కొట్టుకుంటోందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శ.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 26 March 2026 1:53 PM IST
Reddy Shanti
X

Reddy Shanti: కూటమికి పోర్టుల మీద ఉన్న శ్రద్ధ.. అభివృద్ధి మీద లేదా?

శ్రీకాకుళం జిల్లా: ప్రజల దశాబ్దాల కల అయిన ‘మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్’ నిర్మాణాన్ని సాకారం చేసి, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలో నిలపాలని మా నాయకులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పోర్ట్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, ఎంతో చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయించారని, ఇది కేవలం భవనం కాదు, ఉత్తరాంధ్ర ప్రజల ఆర్థిక జీవనాడి అని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తెలిపారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సుమారు 70-75 శాతం పనులు పూర్తి చేసుకున్న ఈ పోర్టు ప్రాజెక్టును, ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నేడు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం, తాము చేసిందేమీ లేకపోయినా, గత ప్రభుత్వం కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుని సొంత డప్పు కొట్టుకోవడం హాస్యాస్పదం ఉంది. అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం అవుతున్నారు.

మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసినప్పటి నుండి, భూసేకరణ దగ్గర నుండి నిర్మాణం వరకు నిరంతరం పర్యవేక్షించి, రూ. వేల కోట్లు కేటాయించింది ఎవరి ప్రభుత్వం? దశాబ్దాలుగా నానిన ఈ ప్రాజెక్టును మట్టిలో నుండి లేపింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఇప్పుడు ఆ ప్రాజెక్టును చూసి మురిసిపోతున్న కూటమి నేతలు, తమ హయాంలో దీనికి కనీసం ఒక ఇటుక అయినా వేశారా? వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక, పనులు ఆపడం, ప్రాజెక్టుల పేర్లు మార్చడం తప్ప, కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా ఈ జిల్లాకు తీసుకురాలేని అసమర్థ పాలన కూటమి ప్రభుత్వం అందిస్తోంది.

మీ రాజకీయ ప్రచారాలకు పోర్టులను వాడుకోవడం మానుకుని, కనీసం ఆ అభివృద్ధిని కొనసాగించాలనే ఆలోచన తెచ్చుకోండి. ఇప్పటికైనా అనవసరపు ప్రచారాలు మాని, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల (మార్చి) 30న మూలపేట పోర్టు వద్ద "పోర్టు సందర్శన - బహిరంగ సభ" నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story