అధిక ఆదాయం దిశగా రైతన్న అడుగులు.. గుర్లలో ఉద్యాన పంటల సాగుపై చైతన్యం
Gurla Mandal: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇచ్చారు.
అధిక ఆదాయం దిశగా రైతన్న అడుగులు.. గుర్లలో ఉద్యాన పంటల సాగుపై చైతన్యం
Gurla Mandal: గుర్ల మండలం, ఆనందపురం రైతు సేవా కేంద్రం పరిధిలో గల రైతులకు ఆత్మ సౌజన్యంతో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి పి. నిర్మల, వ్యవసాయ అధికారి, జిల్లా వనరుల కేంద్రం విజయనగరం వారు మాట్లాడుతూ సమగ్ర పంటల యాజమాన్యం, సేంద్రియ వ్యవసాయం, జీవన ఎరువుల వాడకం, పంటల మార్పిడి, పచ్చి రొట్టెలు ప్రాముఖ్యత, చిరుధాన్యాల సాగు గురించి, విత్తన గుళికలు తయారీ గురించి వివరించారు.
శ్రీ.ఎ. తిరుపతిరావు మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ "రైతన్న -మీకోసం " కార్యక్రమంలో భాగంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు సాగు, సాంప్రదాయ వ్యవసాయ పంటల అయిన వరి,మొక్కజొన్న ,చెరుకు, ప్రత్తి నుంచి అధిక దిగుబడి మరియు ఆదాయం ఇచ్చే ఉద్యాన పంటల సాగు దిశగా పరివర్తనం.
తక్కువ శ్రమ మరియు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం దిశగా ఉద్యాన పంటల సాగు లక్ష్యంతో పంటల వైవిధ్యీకరణ దిశగా అడుగులు, గ్రామాల్లో మార్గదర్శి రైతుల గుర్తింపుతో అధిక విలువనిచ్చే ఉద్యాన పంటల సాగుకు తొలి అడుగు మరియు మిగిలిన రైతులకు ఆదర్శం,
అధిక ఆదాయం దిశగా వాణిజ్య పంట అయిన ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యత మరియు ప్రభుత్వ సహకారం గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీసాలు చిన్నప్పల నాయుడు, యస్ యామిని,కె . గాయత్రి గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




