Upperu: అక్రమ కలప నిల్వలపై ఉక్కుపాదం.. ఉప్పెరులో టేకు స్వాధీనం!
Upperu: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ఉప్పెరు గ్రామంలో అటవీ శాఖ అధికారుల దాడులు. పాడుబడిన ఇంట్లో నిల్వ ఉంచిన 23 టేకు దుంగల స్వాధీనం.
Upperu: అక్రమ కలప నిల్వలపై ఉక్కుపాదం.. ఉప్పెరులో టేకు స్వాధీనం!
Upperu: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం అమరవరం రేంజ్ పరిధిలోని ఉప్పెరు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను బుధవారం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పెదరాయిగూడెం బీట్ అధికారి పాపిరెడ్డి, సిబ్బందితో ఉప్పెరు గ్రామంలోని పాడుబడిన ఓ పెంకుటింట్లో అక్రమ టేకు కలప ఉన్నట్లు పక్కా సమాచారం మేరకు దాడులు చేసి 23 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా అమరవరం రెంజర్ హరిగోపాల్ మాట్లాడుతూ దొరికిన కలప విలువ సుమారు యాభై వేలు ఉంటుందని, ఎలాంటి అనుమతులు లేకుండా కలప తరలించినా,నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎక్కడైనా, ఎప్పుడైనా కలప అక్రమ రవాణా చేసినట్టు తెలిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గొప్యంగా ఉంచుతమన్నారు. ఈ కార్యక్రమంలో బిట్ అదికారులు పాపిరెడ్డి, వంశీ కృష్ణ , స్ట్రెయియికింగ్ పోర్స్ సిబ్బంది ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.




