Nellore: రైల్వే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్: నెల్లూరులో ఉచిత శిక్షణ.. ఏప్రిల్ 8 చివరి తేదీ!
Nellore: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్-డి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నెల్లూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం ఉచిత శిక్షణ ప్రకటించింది.
Nellore: రైల్వే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్: నెల్లూరులో ఉచిత శిక్షణ.. ఏప్రిల్ 8 చివరి తేదీ!
Nellore: ఇటీవల దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగ ఎంపిక కోసం ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది.. దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమానికి సంకల్పించింది.. ఇందుకోసం వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో దాదాపు 100 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానించింది.. వార్షిక ఆదాయం లక్షలోపు ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యర్థులు, ఈ పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు అర్హులుగా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి పి వెంకటలక్ష్మి తెలిపింది.
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, విజయవాడ వారి ఆదేశాల మేరకు , రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్- డి 2026 పరీక్షలకు అర్హులైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన బి.సి, ఎస్.సి, మరియు ఎస్.టి కులములకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంచాలకులు పి. వెంకట లక్ష్మి ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 08 వ తేదీ వరకు పొడిగించడమైనది. కావున ఏప్రిల్ 08 వ తేదీ లోగా బీసీ స్టడీ సర్కిల్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారికి దరఖాస్తు చేసుకొనవలసి ఉంటుందని, 100 మంది అభ్యర్థులకు రెండు నెలలపాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్-డి కి అప్లై చేసిన వార్షిక ఆదాయము రూ. లక్షలోపు అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత శిక్షణకు అర్హులని, అభ్యర్థుల యొక్క ఎంపిక విధానం పదవ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు పదవ తరగతి మార్కుల లిస్టు, కులధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము (ఇటీవల జారీ చేయబడినది), మరియు ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్- డి కి అప్లై చేసిన ఆన్లైన్ జిరాక్స్, మరియు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచి, అభ్యర్థులు ఏప్రిల్ 08 వ తేదీ లోగా నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపములోని బి.సి. స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొనవలసి ఉంటుందని, ఇతర వివరములకు బి.సి. స్టడీ సర్కిల్ ఫోన్ నెంబర్ 9381554779, 9390239588 నంబర్లకు కాల్ చేసి ఫోన్ ద్వారా సంప్రదించగలరని బి.సి. స్టడీ సర్కిల్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంచాలకులు పి. వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు.




