Atmakur: మూగజీవాల ఆరోగ్యమే రైతుకు బలం.. చేజర్లలో పశు వైద్య శిబిరం!
Atmakur: చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహణ. పాడి పశువులకు పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ.
Atmakur: మూగజీవాల ఆరోగ్యమే రైతుకు బలం.. చేజర్లలో పశు వైద్య శిబిరం!
Atmakur: చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో, ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు..ఈ ఉచిత పశు వైద్య శిబిరాన్ని, ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, ఉపసంచాలకులు పశుసంవర్ధక శాఖ డాక్టర్ నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
నాగుల వెల్లటూరు గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాడి పశువులకు, చూటి పరీక్షలు, గర్భకోశ వ్యాధి పరీక్షలు,
దూడలకు నట్టల నివారణ మందులు అందించారు. వేసవికాలంలో పాడి పశువుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. మూగజీవాలు పసి బిడ్డలతో సమానమని, పశువులు అనారోగ్యం బారిన పడిన వెంటనే, ప్రాంతీయ పశు వైద్యశాలను సందర్శించాలని సూచించారు.. వేసవి కాలంలో వచ్చే అన్ని జబ్బులకు పశు వైద్యశాలలో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వం పాడి రైతుల పట్ల అన్ని విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాడి రైతులకు ఉచిత మందులు అందుబాటులోకి తెచ్చేందుకు ఎప్పుడు ముందుంటారని చెప్పారు. ఈ ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో
సహాయ సంచాలకులు ప్రాంతీయ పశువైద్యశాల కలువాయి డాక్టర్ గురుజయంతి , చేజర్ల పశువైద్యాధికారి డాక్టర్ పి రాజేష్ తో పాటు , పశుసంవర్ధక శాఖ సిబ్బంది సజ్జాద్,శ్రీకాంత్, మల్లికార్జున, వెంకటేష్, పాల్గొన్నారు.




