Gokavaram: పవన్ కళ్యాణ్ కు సనాతన ధర్మం గుర్తుకురావాలి
Gokavaram: టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గోకవరం వైఎస్సార్‌సీపీ నాయకులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
Gokavaram: పవన్ కళ్యాణ్ కు సనాతన ధర్మం గుర్తుకురావాలి
Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం :-సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటున్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు విషయంలో ఎందుకు సనాతన ధర్మం గుర్తుకు రావడం లేదంటూ, బి ఆర్ నాయుడుని పదవి నుండి తప్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధిని ప్రసాదించాలని గోకవరం మండల వైఎస్ఆర్సిపి నాయకులు శనివారం వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఉన్న ఒక వీడియో పై వైసిపి నాయకులు స్పందించారు.
గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం, స్థానిక ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కల్తీ జరగలేదని లేదని, సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రస్తుత టిటిడి చైర్మన్ ఒక మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసు కోవడం లేదని ప్రశ్నించారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఒక మహిళ స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ జనసేన నాయకుడు మాత్రం స్పందించకపోవడం దారుణం అన్నారు.
రాష్ట్రంలో మహిళలు, దళితులుపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహించి హోం మంత్రి అనిత రాజీనామా చేయాలన్నారు. మచిలీపట్నం నుండి గుంటూరు వరకు 110 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉన్న ఈ ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా పరిగణించాలాన్నారు. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ, రాజధాని పనులు ఎప్పటికీ పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి లో ఉన్నామన్నారు. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో మహిళను లాటితో కొట్టినప్పటికి ఆయన స్పందించరని, రాష్ట్రంలో దారుణమైన పరిపాలన కొనసాగుతుందని అన్నారు.
గత వైసిపి హయంలో చిన్న ఆడియో టేప్ వచ్చిన కారణంగానే అప్పటి ఎస్ వి బి సి భక్తి ఛానెల్ చైర్మన్ పదవి నుండి పృథ్వీరాజ్ ను తొలగించి జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మంపై తనకున్న మక్కువను చాటుకున్నారని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి టిటిడి చైర్మన్ పై చర్యలు తీసుకునే విధంగా బుద్ధుని ప్రసాదించాలని తాము వెంకటేశ్వరస్వామిని కోరుకున్నామని అన్నారు. స్థానిక వైసీపీ నాయకులు తోలేటి రాంప్రసాద్, నరాలశెట్టి నరసయ్య, బూల అబ్బులు,అంబటి అబ్రహం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.




