Razole: పదవీ విరమణ చేసిన సర్పంచులకు ఘన సన్మానం
Razole: రాజోలు టీడీపీ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో 23వ వారం 'కేడర్ విత్ లీడర్' కార్యక్రమం జరిగింది.
Razole: పదవీ విరమణ చేసిన సర్పంచులకు ఘన సన్మానం
Razole: 23 వ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక "కేడర్ విత్ లీడర్" కార్యక్రమం ఈరోజు రాజోలు టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య తాటిపాక గ్రామంలోని జి ఎస్ గార్డెన్స్ నందు పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు.
నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు,కూటమి శ్రేణుల నుండి వచ్చిన అర్జీలను పార్టీ నాయకులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ. వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ ల పదవీకాలం ముగియడంతో రాజోలు నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ తరుపున నెగ్గి గత ఐదు సంవత్సరాలు సేవలందించిన సర్పంచులకు దుస్సాలువాలు కప్పి జ్ఞాపిక అందజేసి చిరు సత్కారం చేశారు.
ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ ఒకే రాష్ట్రం..! ఒకే రాజధాని..!!
మన రాజధాని! మన అమరావతి!! అమరావతే మన రాజధాని!! మన నాయకులు,రాష్ట్ర ప్రజల కోసం నిర్మిస్తున్న ప్రజా రాజధాని అమరావతిని మనం అందరం కూడా స్వాగతిద్దాం అన్నారు. అమరావతి రాజధాని కలసాకారమైనందుకు నిన్న ఎంతో చక్కటి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం, కాబట్టి ఈరోజు కూడా మరియొక సారి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువనేత శ్రీ నారా లోకేష్ గారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుందాం అన్నారు.
మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎంతో టఫ్ పీరియడ్ మనందరికీ తెలుసు అలాంటి టఫ్ ఫిరియడ్ లో కూడా ధైర్యంగా నిలబడి సర్పంచులు పోరాడారు. ఎంతో (క్లిష్టమైన పరిస్థితులను) టిపికల్ సిట్యుయేషన్ ఎదురొడ్డి నిలబడ్డారు. గత ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం లేకపోయినా అవతల వాళ్ళు ఎంత అరాచకంగా, కిరాతకంగా మనల్ని ఇబ్బందులు పెడుతున్న దీటుగా నిలబడి మన గళం వినిపించారు. పార్టీ తరఫున మన సర్పంచ్లు ప్రజలకు ఎంతో సేవలందించారు.
నిన్నటితో సర్పంచుల పదవీకాలం ముగిసిందనీ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సర్పంచులపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.మన పార్టీ తరఫున మనందరి తరఫున కంగ్రాట్యులేషన్స్ మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు చేసిన సేవ చాలా చాలా అమూల్యమైనవిఅనీ, రాష్ట్రంలోనే రాజోలు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో ఉంచాలనీ,ఆ విధంగా మనం ప్రతి నిమిషం కూడా పార్టీ కోసం పాటుపడదాం! అని అన్నారు. ఈరోజు ఈ సమావేశాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు సాయిబాబా రాజు, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, చిటికెల రామ్మోహన్ రావు, జగడం సత్యనారాయణ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు లంకే శ్రీనివాసరావు, మొల్లేటి శ్రీనివాస్, జిల్లా పార్టీ కార్యదర్శి రాపాక నవరత్నం, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గొనిపాటి రాజు,
రాజోలు మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి అనుచూరి సునీత రామ పురుషోత్తం, మలికిపురం మండలం పార్టీ అధ్యక్షులు అడబాల సాయిబాబా, సఖినేటిపల్లి మండలం పార్టీ అధ్యక్షులు తాడి సత్యనారాయణ, మామిడికుదురు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి విత్తనాల జానకిరామ్, రాజోలు నీటి సంఘం చైర్మన్ రామేశ్వరపు వెంకట ప్రభాకర్ తదితర కూటమి పార్టీల శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.




