Gudur: వైద్యులపై వేధింపులకు పాల్పడితే జైలుకే ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ హెచ్చరిక!
Gudur: గూడూరు ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ రూ. 30 లక్షల నిధులు కేటాయించారు.
Gudur: వైద్యులపై వేధింపులకు పాల్పడితే జైలుకే ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ హెచ్చరిక!
Gudur: గూడూరు ప్రాంతీయ ఆసుపత్రి అభివ్రుద్దికి ప్రత్యేక చర్యలు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో గురువారం ఆసుపత్రి అభివ్రుద్ది కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, ఆర్డీవో సత్యనారాయణ పాల్గొన్నారు.ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, లేని సౌకర్యాలు వంటి వాటిపై వారు వైద్యులతో చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ..ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆసుపత్రిలో టాయిలెట్ లు నిర్మించేందుకు, మరమ్మత్తులు చేయించేందుకు 30 లక్షల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు.తాగి వచ్చి ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.ఈ విషయంలో ఎవరూ చెప్పినా లాభం లేదని,వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ఆసుపత్రి వద్ద పోలీసు గస్తీ ఏర్పాటు చేసేలా సీఐతో మాట్లాడుతామని ఆయన వివరించారు.ఇంకా ఆర్డీవో సత్యనారాయణ తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, ఆసుపత్రి సూపరిడెంట్ డాక్టర్ షరీనా, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.




