Kukkunoor: సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం.. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరులో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్క్ షాప్‌లో దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై కీలక డిమాండ్.
Kukkunoor: సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం.. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి
ఏలూరు జిల్లా: కుక్కునూరు మండల కేంద్రంలో రెండు రోజుల నుండి జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్క్ షాప్ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవ మతంలో కులాలు ఉండవనే సాకుతో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితా నుండి మినహాయించడం సరైంది కాదని రామకృష్ణ పేర్కొన్నారు. ఏ మతంలో ఉన్నప్పటికీ దళితులు అంటరానితనానికి, సామాజిక వివక్షకు గురవుతూనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. క్రైస్తవ మతంలోకి మారిన వారిని సైతం అగ్రకులాల వారు దళితులుగానే చూస్తూ చిన్నచూపు చూస్తున్నారని, వివిధ రూపాల్లో వారిపై దాడులు మరియు కుల వివక్ష కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు.
ఎస్సీ జాబితాలో ఉన్న వారందరూ చారిత్రక వివక్షకు గురైన వారేనని, కేవలం మతం మారినంత మాత్రాన సామాజిక స్థితిగతులు మారిపోవని ఆయన గుర్తు చేశారు. కావున, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని, దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా పరిగణిస్తూ తగు ఉత్తర్వులు జారీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తికి తాము పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. దళితులందరికీ సమాన హక్కులు, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.రవి, జిల్లా ఉపాధ్యక్షులు యర్రంశెట్టి నాగేంద్రరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్, వ్యకాస జిల్లా నాయకులు,మహంకాళి,జీవరత్నం, వెంకట్రావు,ఉడత వెంకటేష్, మండల నాయకులు షేక్ ఖాసీం, మేడిపల్లి బాబు,ఎస్.కె.వలి,పట్ల లక్షమయ్య,పూలదాసు రమేష్ తదితరులు పాల్గొన్నారు.




