Train Halts: సిక్కోలు కు ఒకే సారి 3 రైల్వే హాల్టులు

Train Halts: కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కృషితో శ్రీకాకుళం జిల్లాకు ఒకేసారి మూడు ట్రైన్ హాల్ట్స్ కొత్తగా మంజూరు అయ్యాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 March 2026 10:44 PM IST
Train Halts: కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కృషితో శ్రీకాకుళం జిల్లాకు ఒకేసారి మూడు ట్రైన్ హాల్ట్స్
X

Train Halts

Train Halts: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా వాసులకు శుభవార్తను మోసుకువచ్చారు. జిల్లా ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చేవిధంగా ఒకేసారి మూడు రైళ్లకు సంబంధించి నూతన హాల్ట్ లను మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ ఉత్తర్వులు విడుదల చెయ్యగా.. వివరాలను రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వీటి ద్వారా అభివృద్ధి వైపు బలంగా శ్రీకాకుళం అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు.

కొత్త హాల్ట్స్ ఇవే..

ఇక నూతనంగా మంజూరు అయిన హాల్టుల వివరాలను పరిశీలిస్తే.. గుణుపూర్, విశాఖపట్నం మధ్య తిరిగే ప్యాసెంజర్ ట్రైన్ నంబర్ 58505/06 ఇకపై హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ వద్ద ఆగనుంది. అదేవిధంగా రైలు నంబర్ 18525/26 బెర్హంపూర్-విశాఖపట్నం ప్యాసెంజర్ కు ఇకపై మండస రోడ్ రైల్వే స్టేషన్ లో హాల్ట్ మంజూరు అయింది. వీటితో పాటు రూర్కెల జంక్షన్, గుణుపూర్ మధ్య తిరిగే రాజ్యా రాణి ఎక్స్ ప్రెస్ 18117/18 ఇకపై పాతపట్నం లో కూడా ఆగి.. స్థానిక ప్రయాణీకులకు మరింత ఉపశమనం కల్పించనుంది.

తాజా రైలు హాల్టుల గురించి ఇప్పటికే అనేక దఫాలుగా కెంద పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. రైల్వే అధికారులకు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లతో భేటి అయి అవసరాన్ని వివరించారు. ఈ నెల నాలుగవ తేదిన సైతం అశ్విని వైష్ణవ్ తో ప్రత్యేకంగా భేటి అయిన రామ్మోహన్ నాయుడు.. నూతన హల్టుల మంజూరు తో పాటు కొత్త సర్వీసుల ప్రతిపాదనను సైతం రైల్వే మంత్రి దృష్టిలో ఉంచారు. వాటిలో కొన్ని నేడు మంజూరు కావడం పట్ల రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజూరుకు పూర్తి తోడ్పాటు అందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కొత్త హాల్టుల ద్వారా అభివృద్ధి మరింత వేగం పెంచుకుంటుందని, ప్రజా రవాణాను మరింత సులభతరం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతీ మూలలో అభివృద్ధిని చేరవెయ్యడానికి రవాణానే ప్రధాన సాధనం అని నమ్మే కూటమి సర్కారు.. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేసి సఫలీకృతం అవుతున్నట్టు తెలిపారు. తాజా హాల్టులను జిల్లా ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి చొరవతో.. కొత్త హాల్టులు మంజూరు కావడం పట్ల జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story