Eluru: రామాలయాలకు 'తపన ఫౌండషన్' తీపి కానుక
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో శ్రీరామనవమి సందర్భంగా తపన ఫౌండషన్ ఆధ్వర్యంలో 9 గ్రామాల్లోని రామాలయాలకు 140 కిలోల బెల్లం పంపిణీ చేశారు.
Eluru: రామాలయాలకు 'తపన ఫౌండషన్' తీపి కానుక
Eluru: ఏలూరుజిల్లా వేలేరుపాడు మండల పరిధిలోని గ్రామాల్లో శ్రీరామ నవమిని పురస్కరించుకుని పానకం నిమిత్తం తపన ఫౌండషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గ్రామాల్లో సుమారు 140 కిలోల బెల్లంను కానుకగా తపన ఫౌండషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామంజనేయ చౌదరి ఆదేశాలతో మండల పరిధిలోని యర్రబోరు, జగన్నాధపురం, కన్నాయిగుట్ట, మేడేపల్లి, కోయ మాదారం, కమ్మరిగూడెం, పెద్ద బుర్రతోగు, భూదేవిపేట, రుద్రంకోట మొదలైన 9 గ్రామాల్లోని రామాలయాలకు శ్రీరామ నవమి పానకం తయారి నిమిత్తం తపన ఫౌండషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్క రామాలయానికి 15 కేజీల చొప్పున బెల్లం కానుక.
ప్రతి రామలయానికి తిరుగుతూ తపన ఫౌండషన్ ప్రతినిధి శివరామ్ ప్రసాద్,బిజెపి మండల అధ్యక్షులు ఒలేటి అనిల్ (బాలకృష్ణ )లు బెల్లం పంపిణీ చేశారు. ప్రజలు ప్రతి పండగను మరింత ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.




