Nellore: నెల్లూరులో జనసేన సభ్యత్వ నమోదు సక్సెస్!
Nellore: నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఒడా చైర్మన్ షేక్ రియాజ్ సందర్శించారు.
Nellore: నెల్లూరులో జనసేన సభ్యత్వ నమోదు సక్సెస్!
Nellore: నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో ఉన్న జనసేన నగర పార్టీ కార్యాలయానికి శుక్రవారం ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ విచ్చేశారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆహ్వానం మేరకు ఆయన నగర పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా సుజయ్ బాబు.. రియాజ్ కు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. రికార్డు స్థాయిలో జనసేన ఉద్యమ స్థాయిలో సభ్యత్వ నమోదు చేసిన జనసైనికులకు ఆయన అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జనసేన పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా.
జనసేన పార్టీలోని ప్రతి కార్యకర్త ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే కాలంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే మన ముందున్న లక్ష్యం అని తెలిపారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ మనసున్న నాయకుడు అని, పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ముందుకు సాగుతున్నారని. ఎవరిని మర్చిపోయే నేత కాదని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ అద్భుతంగా పనిచేశారని, పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు షేక్ రియాజ్.
ఈ కార్యక్రమంలో జనసేన రిజనల్ కో-ఆర్డినేటర్ కోల విజయలక్ష్మి , జిల్లా కార్యదర్శి షేక్ అలియా , నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు , నగర కార్యదర్శి ఆముదాల సుమంత్ , డివిజన్ ఇంచార్జులు చిత్తూరు రాము , బిల్ల ఉదయ్ కిరణ్ , వెంకటరమణ , రామిశెట్టి సుజిత్ , శ్రీనివాసులు నాయుడు , నగర నాయకులు ప్రవీణ్ యాదవ్ , మంచికంటి శ్యామ్ , ప్రభు సాయి , మణికంఠ , వినోద్ తదితరులు పాల్గొన్నారు.




