Kukkunoor: ఎమ్మెల్యేపై బురదజల్లితే ఊరుకోం.. మీడియా ఛానల్‌పై జనసేన యుద్ధం!

Kukkunoor: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అసత్య కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థపై కుక్కునూరు జనసేన నేతల ఫిర్యాదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 7:43 PM IST
Kukkunoor
X

Kukkunoor: ఎమ్మెల్యేపై బురదజల్లితే ఊరుకోం.. మీడియా ఛానల్‌పై జనసేన యుద్ధం!

Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో కొన్ని పంచాయితీలలో ఏర్పాటుచేసిన జామాయిల్, జామ నర్సరీల విషయంలో ఓ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అండతో అటవీ, రెవెన్యూ భూములను కబ్జా చేసి నర్సరీ వ్యాపారాన్ని యదేచ్చగా నిర్వహిస్తున్నారని వచ్చిన కథనాలను కుక్కునూరు జనసేన మండల పార్టీ తీవ్రంగా ఖండించింది.

గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న వ్యాపారాన్ని ప్రస్తుత ఎమ్మెల్యేకి ఆపాదించడం సమంజసం కాదని దీనిపై అసత్య కథనాలు ప్రచారం చేసిన మీడియా ప్రతినిధి పై, సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కుక్కునూరు మండల జనసేన ఉపాధ్యక్షులు మంత్రి గోపాలకృష్ణ, మోదుంపురపు వెంకన్నబాబు ఆధ్వర్యంలో కుక్కునూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం నాడు పిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మండల ఉపాధ్యక్షులు మాట్లాడుతూ జామాయిల్ నర్సరీలకు గౌరవ పోలవరం శాసనసభ్యులకు సంబంధం ఉందని నిరూపించగలరా అని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు మేము సిద్ధమని సవాల్ విసిరారు. అసత్య కథనాలపై సదరు మీడియా సంస్థ స్పందించి బహిరంగ క్షమాపణ కోరకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో జనసేన ఉపాధ్యక్షులు మంత్రి గోపాల కృష్ణ, మోదుంపురపు వెంకన్న బాబు, సీనియర్ నాయకులు చల్ల కోటేశ్వరరావు, టౌన్ ప్రెసిడెంట్ కె సీతారామయ్య, వార్డ్ మెంబెర్ గాడిద వెంకటేశ్వర్లు, ఆవుల శ్రీను, గంధం నాగరాజు,లక్ష్మణ స్వామి,రామ కృష్ణ,జగదీశ్ తదితరులు పాల్గొన్నారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story