Nellore: జగన్ ఇచ్చింది రాయితీలు.. బాబు ఇచ్చేవి కష్టాలు
Nellore: నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Nellore: జగన్ ఇచ్చింది రాయితీలు.. బాబు ఇచ్చేవి కష్టాలు
Nellore: ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగన్ కట్టించిన ఇళ్లను ఇప్పుడు పంచుతూ. తానే చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. నాయుడుపేట సభలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్ధితి లేదని, ఇళ్ల పంపిణీపై చంద్రబాబుచెప్పినవన్నీ అబద్దాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో 31.19 లక్షల ఇళ్ల స్ధలాలిచ్చామని, 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, అందులో 9 లక్షల ఇళ్లు పూర్తి చేసిచ్చామని గుర్తు చేశారు. నిరూపించేందుకు ఎక్కడైనా సిద్దంఅంటూ సవాల్ విసిరారు కాకాణి. జగన్ హయాంలో 1.25 లక్షల టిడ్కో ఇళ్ల పంపిణీ చేసి, 300 ఎస్‌ఎఫ్‌టీ ఇల్లు ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి, పేదల కోసం మొత్తం రూ.12 వేల కోట్ల రాయితీతో టిడ్కో ఇళ్లతో పాటు, మౌలిక సౌకర్యాలూ కల్పించామని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు భారం, టిడ్కో ఇళ్ల లబ్దిదారుల్ని రుణగ్రస్తుల్ని చేశారని, ఒక్కొక్కరిపైనా రూ.7.2 లక్షల భారం మోపారని, అమరావతిలోనూ పేదల కడుపు కొట్టారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెర లేపారని, ఇవాళ (సోమవారం) నాయుడుపేట సభలో ఆయన చెప్పిన అబద్దాలే అందుకు నిదర్శనమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో ఇళ్ల పంపిణీ పేరుతో పేదలపై భారం మోపిన చరిత్ర చంద్రబాబుది అయితే, వారికి రూ.12 వేల కోట్ల రాయితీలు కల్పించి ఇళ్లను నిర్మించి ఇచ్చిన చరిత్ర జగన్‌గారిదని కాకాణి గుర్తు చేశారు. అయినా ఆయనపై సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలు వల్లె వేస్తున్నారని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు.
చంద్రబాబు పాలనను ఈసడించుకుంటున్న జనం:
ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్ధితుల్లో లేరని అన్నారు ..నాయుడుపేటలో చంద్రబాబు ఉపన్యాసం వినడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపించక పోవడమే ఇందుకు నిదర్శనం. సభ జరుగుతుండగానే జనం బయటికి వెళ్లిపోయారని చెప్పారు. చంద్రబాబు పాలనకు ప్రజలు ఎలా స్పందిస్తున్నారో దీన్ని బట్టి తెలుస్తోంది.
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజం ఎప్పుడూ బయటికి రాదు. ఆయనకు ఏమీ పని లేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక బొంకుల బాబు అవతారం ఎత్తి లేని పోని విమర్శలు చేస్తుంటారని చెప్పారు కాకాణి. ఎవరు చేసిన మంచి పని అయినా తన ఖాతాలో వేసుకోవడం, తప్పు జరిగితే అధికారులు, ఇతరులు, ప్రతిపక్షాల మీద నెట్టేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.




