Korukonda: రామాలయ అభివృద్ధికి కంబాల భారీ విరాళాలు

Korukonda: కోరుకొండ వడ్డీలపేట రామాలయ పున:ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నసమారాధనలో బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 8:22 PM IST
Korukonda
X

Korukonda: రామాలయ అభివృద్ధికి కంబాల భారీ విరాళాలు

Korukonda: తూర్పుగోదావరి కోరుకొండ : కోరుకొండ గ్రామంలోని వడ్డీల పేటలోని రామాలయం విగ్రహ పున:ప్రతిష్ట మహోత్సవాలు పురస్కరించుకొని, శుక్రవారం ఆలయం వద్ద నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలిత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆలయం వరకు తీన్మార్ డప్పులతో, పూలు జల్లుతూ ర్యాలీగా తరలించారు.

మహిళలు హారతులు పట్టారు. కమిటీ సభ్యులు పూలమాలలతో ఘనంగా సత్కరించి, సీతారాముల వారి చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న దాడులను అందరు కలిసికట్టుగా ఉండి, ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కొంతమంది విదేశీయులు, స్వార్థపరులు అన్నదమ్ముల కలిసి ఉంటున్న, మన మధ్య చిచ్చుపెట్టి మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఇటువంటి చర్యలు మనమందరం సమీష్టంగా ఎదుర్కోవాలన్నారు. ఈ అన్నసమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు 1,40,000 రూపాయలు విరాళం ప్రకటించారు. తీన్మార్ డప్పు బృందానికి 15 మందికి 500 రూపాయలు చొప్పున 7,500 రూపాయలు అందించారు. అలాగే గతంలో ఆలయంలో సీతారాములు, లక్ష్మణ్, హనుమాన్ విగ్రహాలకు 1,60,000 రూపాయలు, ఆలయానికి రంగులు వేయించడానికి 2 లక్షలు రూపాయలు విరాళం అందించారు.

ఈ కార్యక్రమంలో బత్తుల నానాజీ, కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, రాజానగరం బీజేపీ మండల అధ్యక్షులు ఆళ్ల శివ నాగరాజు, పెద్దాడ వెంకన్న దొర, నాగరమేష్, రాయపాటి సత్యనారాయణ, ఆనం చెల్లరావు, పచ్చారి నరసింహరావు, చింతల కన్నారావు, బత్తిన వీరాంజనేయులు, పలకంశెట్టి శ్రీను, మండే గౌతమ్, నండూరి దుర్గారావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story