Nellore: నుడా చైర్మన్ సీరియస్.. ఎల్ఆర్ఎస్ పనుల్లో జాప్యం వద్దు!

Nellore: నెల్లూరు జిల్లాలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) విజయవంతానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కీలక సమావేశం.

V. Narasimhulu, Nellore
Published on: 7 April 2026 7:44 PM IST
Nellore
X

Nellore: నుడా చైర్మన్ సీరియస్.. ఎల్ఆర్ఎస్ పనుల్లో జాప్యం వద్దు!

Nellore: ప్రతి ఒక్కరు LRS ను సీరియస్ గా తీసుకోవాలన్నారు నుడా చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్లతో సమావేశమయ్యారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి.

ఈ సందర్భంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ..

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. అక్రమ లే అవుట్లు, అనధికారిక భూములను చట్టబద్ధం చేయడానికి ఇదో మంచి అవకాశం అన్నారు. నెల్లూరు కందుకూరు ఆత్మకూరు కావలి మున్సిపల్ కమీషనర్లతో కార్యాలయంలో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

వైస్ చైర్మన్ మొగలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ మాట్లాడారు.. ఎల్ఆర్ఎస్ పై అవగాహన కల్పించేందుకు, దాన్ని విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయాలన్నారు.. వార్డ్ ప్లానింగ్ అధికారులు కొత్తగా ఉండడంతో కొంతమేర జాప్యం జరుగుతోందని, తన దృష్టికి వచ్చిందని చెప్పారు.

మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు కమీషనర్ లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేస్తామని. LRS ను విజయవంతంగా నిర్వహించాలని కోటంరెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఈ పథకాన్ని విజయవంతం చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లతో పాటు నుడా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story