Venkatraopalli: దళితుల అవస్థలు స్మశాన వాటిక ఆక్రమణపై కెవిపిఎస్ ఆగ్రహం

Venkatraopalli: ఆత్మకూరు మున్సిపాలిటీ వెంకట్రావుపల్లిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకొన్న స్మశాన వాటిక ఆక్రమణ, ఇళ్ల స్థలాల కొరత మరియు మంచినీటి సమస్యలను కెవిపిఎస్ బృందం పరిశీలించింది.

M Satya Peter, Atmakur
Published on: 1 April 2026 6:51 PM IST
Venkatraopalli
X

Venkatraopalli: దళితుల అవస్థలు స్మశాన వాటిక ఆక్రమణపై కెవిపిఎస్ ఆగ్రహం

Venkatraopalli: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లిలోని ఎస్సీ ఎస్టీ కాలనీలలో పలు సమస్యలపై పరిశీలనకు వచ్చారు. ఈ కార్యక్రమానికి కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నేలపాటి రఘురామయ్య,ఆలూరు తిరుపాలు. స్థానిక నియోజకవర్గం కుల వివక్ష పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఎస్సీ ఎస్టీలతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ 85 దళిత,గిరిజన కుటుంబాలు నివసిస్తున్నారని అయితే ఇక్కడ ఉన్న వారి స్మశానం ఆక్రమణకు గురికావడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అలాగే మంచినీటి సమస్య ఉన్నదని, ఇళ్ల స్థలాలు లేకపోవడంతో ఒక్కో ఇంటిలో రెండు మూడు కుటుంబాలు వారు నివసిస్తున్నారని కెవిపిఎస్ నిర్వహించిన విచారణలో తేలిందని తెలిపారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం ఆత్మకూరు ఎమ్మార్వో,ఆర్డిఓ లను కలిసి వినతి పత్రాలు ఇచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు కొప్పోలు డేవిడ్, కౌలు రైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి, సిఐటియు జిల్లా సెక్రటేరియట్ సభ్యులు జి. శివప్రసాద్, కెవిపిఎస్ నాయకులు పెంచలయ్య స్థానికులు పోలయ్య , ఏడుకొండలు, బంగారమ్మ, సింగంశెట్టి నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story