Palakonda: ఆస్తి పన్ను కడుతున్నారా? అయితే ఈ రోజే లాస్ట్ డేట్!

Palakonda: పాలకొండ నగర పంచాయతీ ఆస్తి పన్ను బకాయిదారులకు గమనిక. 50 శాతం వడ్డీ రాయితీతో పన్నులు చెల్లించే గడువు మార్చి 31తో ముగియనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 9:29 AM IST
Palakonda
X

Palakonda: ఆస్తి పన్ను కడుతున్నారా? అయితే ఈ రోజే లాస్ట్ డేట్!

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఇంటిపన్ను చెల్లింపుల బకాయిలు వున్న వారికి 50% వడ్డీరాయితీతో పన్నులు చెల్లించేందుకు ఇచ్చినగడువు నేటి సాయంత్రంతో ముగియనుందని నగరపంచాయతీ కమిషనర్ ఎస్.జె.వి.రత్నరాజు తెలిపారు. 2026-26 ఆర్థిక సంవత్సరంకు చెందిన ఆస్తిపన్నులతోపాటు, అంతకుముందు పన్నులు చెల్లించకుండా బకాయిలు వున్నవారు ఎవరున్నా 50% వడ్డీ రాయితీతో పన్నులు చెల్లించుకునేందుకు ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు గొడుగు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

పన్ను బకాయి దారులు వెంటనే స్పందించి 50 శాతం వడ్డీ రాయితీని వినియోగించుకొని పన్నులు చెల్లించాలని ఆయన సూచించారు. గడువుముగిసిన అనంతరం పన్ను చెల్లింపుల సమయంలో నూరుశాతంవడ్డీ చెల్లించవలసి ఉంటుందని రత్నరాజు పేర్కొన్నారు. నగర పంచాయతీ పరిధిలో గృహ, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు సంబంధించి పేరుకుపోయిన మొండి బకాయి దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ప్రజలు వెంటనే స్పందించి పన్నుబకాయిలను చెల్లించి తద్వారా నగరపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story