Pattikonda: రెండోసారి బార్ ప్రెసిడెంట్‌గా మధు బాబు

Pattikonda: పత్తికొండ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వై. మధు బాబు అధ్యక్షుడిగా ఒక ఓటు తేడాతో విజయం సాధించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 March 2026 8:22 PM IST
Pattikonda
X

Pattikonda: రెండోసారి బార్ ప్రెసిడెంట్‌గా మధు బాబు

Pattikonda: పత్తికొండ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బార్ అధ్యక్షులుగా హోరాహోరీ పోటీలో అధ్యక్ష పదవికి ఒక ఓటుతో వై మధు బాబు రెండోసారి విజయం సాధించారు. జనరల్ సెక్రటరీ జగదీష్ 23 ఓట్లతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ కి జై రవి కుమార్ 9 ఓటుతో వరుసగా మూడోసారి విజయం సాధించారు లైబ్రరీ మరియు జాయింట్ సెక్రెటరీ పోస్ట్ కి ఎం నరసరావు ఐదు ఓట్లతో వరుసగా రెండోసారి విజయం సాధించారు సరోజ బాయ్ కోశాధికారిగా, లేడీ రిప్రజెంటేటివ్ గా షేక్ షాజిదా బేగం గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా భారత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పై మధుబాబు మాట్లాడుతూ. న్యాయవాదుల సంక్షేమం, అభివృద్ధి, వారి హక్కుల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పత్తికొండలో సబ్ కోర్టు ఏర్పాటుకు, న్యాయవాదులకు ఇల్లు,ఇళ్ల స్థలాల మంజూరు కోసం, పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవనాల కోసం భవిష్యత్ కార్యాచరణ తీసుకొని న్యాయవాదులందరి సహకారంతో ముందుకు వెళ్తానని తెలిపారు.

బార్ అభివృద్ధికి కృషి చేస్తానని ఏనుగుల మధుబాబు అన్నారు. శనివారం స్థానిక కోర్టు ఆవర్ణంలో న్యాయవాదులందరూ ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story