Mahanandi: మహానందీశ్వరుడికి కానుకల వెల్లువ.. నెలరోజుల ఆదాయం ఎంతంటే?
Mahanandi: నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఘనంగా హుండీ లెక్కింపు. గత 31 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల వివరాలను వెల్లడించిన ఆలయ ఈఓ శ్రీనివాస్ రెడ్డి.
Mahanandi: మహానందీశ్వరుడికి కానుకల వెల్లువ.. నెలరోజుల ఆదాయం ఎంతంటే?
Mahanandi: నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలోని శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల కానుకల లెక్కింపు నిర్వహించారు. మార్చి 30, 2026న కార్యనిర్వహణాధికారి, ఉప కమిషనర్ ఎన్. శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో అభిషేక మండపంలో ఈ హుండీ లెక్కింపు జరిగింది.
గత 31 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన మొత్తం కానుకలు రూ. 32,29,396 గా నమోదయ్యాయి.ఆలయ హుండీ ఆదాయం: రూ. 31,91,72 అన్న ప్రసాదం: రూ. 22,986 గో సంరక్షణ: రూ. 14,683..
ఈ లెక్కింపులో దేవాదాయ శాఖ అధికారులు, బండి ఆత్మకూరు గ్రూప్ టెంపుల్ ఈఓ ఏ. నాగప్రసాద్, దేవస్థాన ఏఈఓ వై. మధు, పర్యవేక్షకులు, ఇన్స్పెక్టర్లు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్, తిరుమల బాలాజీ సేవా సమితి సేవకులు కూడా హాజరయ్యారు. భక్తుల విశ్వాసంతో దేవస్థానానికి పెద్దఎత్తున కానుకలు అందుతున్నాయని అధికారులు తెలిపారు.




