Marripadu: కోళ్ల వ్యర్థాల వాహనంపై ఎస్సై పంజా

Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న కోళ్ల వ్యర్థాలను ఎస్సై కాసులు శ్రీనివాసరావు పట్టుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 April 2026 2:51 PM IST
Marripadu
X

Marripadu: కోళ్ల వ్యర్థాల వాహనంపై ఎస్సై పంజా

Marripadu: కోళ్ల వ్యర్థాలను ఆహారంగా వేసేందుకు ఇతర రాష్ట్రాల నుండి బొలెరో వాహనంలో తరలిస్తున్న సమాచారంతో మర్రిపాడు ఎస్ఐ కాసులు శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి చుంచులూరు జాతీయ రహదారిపై కాపు కాసి పంజా విసిరారు 15 డ్రమ్ముల చికెన్ వ్యర్ధాలను స్వాధీనం చేసుకొని యజమాని, డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.

పట్టుకున్న వ్యర్థాలను జెసిబితో గుంతలు తవ్వించి రెవెన్యూ అధికారుల సమక్షంలో ఊరి బయట పూడ్చివేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కర్ణాటక నుంచి చికెన్ వ్యర్థాలను ఆంధ్రకు తరలించడం చట్టరీత్య నేరమని ఆ వ్యర్ధాలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పుందని అలాగే వెనక వచ్చే వాహన దారులకు మరియు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుందని ఆయన మండిపడ్డారు.

ప్రజల ప్రాణాలకు భద్రత ఆరోగ్య రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పై ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో చుంచులూరు ఇన్చార్జి, విఆర్డీ మరియు వీఆర్ఎ, పోలీస్ సిబ్బంది పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story