Vizag: లోకేష్ ముందు ఉపాధ్యాయుల గోడు!
Vizag: విశాఖపట్నం పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను 1998 బ్యాచ్ ఉపాధ్యాయ సంఘం (MATS) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Vizag: లోకేష్ ముందు ఉపాధ్యాయుల గోడు!
Vizag: శ్రీకాకుళం జిల్లా కంచిలి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అనకాపల్లి ఉక్కు కర్మాగారం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుని విశాఖపట్నం అతిథి గృహంలో ఎంఎటీఎస్ (ఎంటి ఎస్) 1998 బ్యాచ్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి తమ వినతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు 62 సంవత్సరాల వరకు సేవా పొడిగింపు కల్పించాలని, ఈ అంశాన్ని మంత్రుల కమిటీ పరిధిలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ నిర్ణయం అమలైతే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,072 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
తమ సమస్యను సహనంతో విన్న మంత్రి నారా లోకేష్ బాబుకు సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సానుకూల నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ఎంఎటీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్ రెడ్డి, సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు.




