Vinjamur: వింజమూరులో మేకపాటి అభినవ్ బర్త్‌డే హంగామా!
Vinjamur: నెల్లూరు జిల్లా వింజమూరులో మేకపాటి అభినవరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 45 కిలోల కేక్ కటింగ్, రక్తదాన శిబిరంతో అభినవ్ ఆర్మీ సందడి చేసింది.
Vinjamur: వింజమూరులో మేకపాటి అభినవ్ బర్త్‌డే హంగామా!
Vinjamur: నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి ఉదయగిరి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి తనయుడు మేకపాటి అభినవరెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా వింజమూరు పట్టణంలో నిర్వహించారు. జన్మదిన వేడుకలు పురస్కరించుకొని వి ఆర్ ఫంక్షన్ ప్లాజాలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు.
అభినవ్ రెడ్డి 45వ రోజు పుట్టిన రోజు సందర్భంగా 45 కిలోల కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి గుడ్పు వీర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువనేత ఉదయగిరి నియోజకవర్గానికి మార్గదర్శిగా పార్టీని నడిపిస్తున్న యువ కెరటం మేకపాటి అభినవ్ రెడ్డి జన్మదిన వేడుకలును అభినవ్ ఆర్మీ సైన్యం ఉత్సాహంగా నిర్వహించి అభినవరెడ్డి పై ఉన్న ప్రేమను చాటారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి, జిల్లా పబ్లిసిటీ వింగ్ కన్వీనర్ నరసింహారెడ్డి, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి,చిన్న కృష్ణారెడ్డి విజయ్, ప్రసాద్, కొండయ్య, మరియు అభినవ్ ఆర్మీ సైన్యం గంగిరెడ్డి, శివారెడ్డి, జిలాని,బాబు రాయుడు, రాఘవ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




