BC Janardhan Reddy: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన బీసీ జనార్దన్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు!

BC Janardhan Reddy: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేటలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 March 2026 5:27 PM IST
BC Janardhan Reddy
X

BC Janardhan Reddy: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన బీసీ జనార్దన్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు!

బనగానపల్లె (నంద్యాల జిల్లా): నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేటలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. పాఠశాల పనితీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఆహార నాణ్యతపై ఆరా:

ముఖ్యంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నిశితంగా పరిశీలించారు. వంట గదిని తనిఖీ చేసి, భోజనం తయారీలో వాడుతున్న సరుకులు, కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి.. వారికి అందుతున్న భోజనం రుచిగా ఉందా? మెనూ ప్రకారం పెడుతున్నారా? అని ఆరా తీశారు. ప్రభుత్వ లక్ష్యం విద్యార్థులకు పోషకాహారం అందించడమేనని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు.

సచివాలయ సేవలు పక్కాగా ఉండాలి:

అనంతరం ఇల్లూరు కొత్తపేట సచివాలయాన్ని సందర్శించిన మంత్రి, రికార్డులను తనిఖీ చేశారు. ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యం జరగకూడదని, గడువులోగా అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యాశాఖ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story