Banaganapalle: బనగానపల్లె: స్కూల్, సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

బనగానపల్లె (నంద్యాల జిల్లా): నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Sai Potluri
Published on: 17 March 2026 4:33 PM IST
Banaganapalle
X

Banaganapalle: బనగానపల్లె: స్కూల్, సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

బనగానపల్లె (నంద్యాల జిల్లా): నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPP High School) మరియు గ్రామ సచివాలయాన్ని సందర్శించి, అక్కడి పనితీరును స్వయంగా పరిశీలించారు.

మధ్యాహ్న భోజనం రుచి చూసిన మంత్రి

పాఠశాల సందర్శనలో భాగంగా మంత్రి నేరుగా వంటశాలకు వెళ్లి, విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరీక్షించారు. ఆహార ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని నిర్వాహకులను ఆదేశించారు. భోజనం అందుతున్న తీరు, మెనూ అమలుపై విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

సచివాలయ సేవల్లో జాప్యం వద్దు

అనంతరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన మంత్రి, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకమైన పాలన అందించాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యాశాఖ అధికారులు మరియు ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.

Sai Potluri

Sai Potluri

Next Story