Nellore: నెల్లూరులో భక్తి పారవశ్యం.. రాములోరి కళ్యాణంలో రమాదేవి!

Nellore: నెల్లూరు జేమ్స్ గార్డెన్‌లో నాగేంద్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, జనసేన నేత గునుకుల కిషోర్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 3:07 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో భక్తి పారవశ్యం.. రాములోరి కళ్యాణంలో రమాదేవి!

Nellore: నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్‌ లో శ్రీరామ నవమి సందర్భంగా. నాగేంద్ర మరియూ టీం ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహిస్తున్న, విజయ మహల్ గేటు వద్ద జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మంత్రి పొంగూరు నారాయణ సతీమణి శ్రీమతి పొంగూరు రమాదేవి తో కలిసి , జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, పలువురు కూటమి నాయకులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ పవిత్రమైన రోజున సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. “రామో విగ్రహవాన్ ధర్మః” అనే వాక్యం మనందరికీ తెలిసినదే… శ్రీరాముడు ధర్మానికి సజీవ రూపం. ఆయన జీవితం మనకు నిజాయితీ, కర్తవ్యబోధ, త్యాగం, న్యాయం వంటి విలువలను నేర్పుతుంది అన్నారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గునుకుల కిషోర్.

శ్రీ సీతారాముల కళ్యాణం కేవలం ఒక ఆచారం కాదు… అది మన కుటుంబ వ్యవస్థకు, మన సంస్కృతికి, మన సంప్రదాయాలకు ప్రతీక. సీతమ్మ గారి సహనం, శ్రీరాముడి నిబద్ధత, ఇవి ప్రతి కుటుంబం అనుసరించాల్సిన ఆదర్శాలు అని చెప్పారు.

ఈ విధంగా భక్తితో, శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న నాగేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంచుతూ, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే శక్తిగా నిలుస్తాయన్నారు.

జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ, సంస్కృతి పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది. సమాజంలో మంచి విలువలు పెంపొందించే ప్రతి కార్యక్రమానికి మేము మద్దతుగా ఉంటామని చెప్పారు.

శ్రీ సీతారాముల ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను అని చెప్పారు మంత్రి నారాయణ సతీమణి రమాదేవి.

ఎన్నో సంవత్సరాలుగా ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న నాగేంద్ర గారు మరియు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తూ, భక్తి పరంపరను నిలబెట్టే ఈ సేవ ప్రశంసనీయం అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారి సతీమణి శ్రీమతి రమాదేవి , మరియు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల వారి సతీమణి కిషోర్ విజయలక్ష్మి గునుకుల, 45డివిజన్ జనసేన నాయకులు సుధా మాధవ్ బెల్లపు, బిజెపి నాయకులు ఇండ్ల శ్రీనివాసులు, రాజేశ్వరమ్మ, తెలుగుదేశం నాయకులు యశ్వంత్, పోకల రవి, శ్రీనివాసులు,గాయత్రి కళ్యాణి,తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story