Irripaka: అమరావతికి చట్టబద్ధత.. జగ్గంపేటలో ముగ్గులతో వేడుకలు
Irripaka: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని హర్షిస్తూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఇర్రిపాకలో సంబరాలు నిర్వహించారు.
Irripaka: అమరావతికి చట్టబద్ధత.. జగ్గంపేటలో ముగ్గులతో వేడుకలు
Irripaka: ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడాన్ని పురస్కరించుకుని ఆదివారం జగ్గంపేట నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జై అమరావతి అంటూ ముగ్గులు వేసి తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు.
జగ్గంపేట మండలం ఇ ర్రిపాకలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వయంగా పాల్గొని గాంధీ విగ్రహం కూడలి వద్ద నాయకులతో కలిసి పూలతో ముగ్గులు వేసి, 'మన రాజధాని మన అమరావతి' అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆంధ్రుల కలల రాజధాని,
ప్రజా రాజధాని అమరావతికి చట్టభద్రత వచ్చిందని జగన్ రెడ్డి ఎన్ని కుతంత్రాలు చేసినా ఆంధ్రుల రాజధాని అమరావతిని ఏమీ చేయలేరని ఆంధ్ర రాష్ట్రం కోసం 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, కుటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.




