Udayagiri: కార్యకర్తలకు కొండంత అండ.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ!

Udayagiri: రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు కుటుంబానికి రూ. 5 లక్షల ప్రభుత్వ భీమా అందజేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 7:21 PM IST
Udayagiri
X

Udayagiri: కార్యకర్తలకు కొండంత అండ.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ!

Udayagiri: కలిగిరి మండలం, కావలి ముస్తాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తరిమెర్ల శ్రీనివాసులు గత కొన్ని నెలల క్రితం జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం.ఈ విషాద ఘటనను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో, ప్రభుత్వం ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయల ప్రమాద భీమా సహాయాన్ని శ్రీనివాసులు మృతుడు భార్య తరిమెర్ల ఓబులమ్మ మరియు వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గారు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు కష్టసమయంలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం తెలుగుదేశం పార్టీ విధిగా భావిస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీకి అండగా నిలిస్తే, పార్టీ కూడా వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ సంఘటన, కార్యకర్తల పట్ల పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు. అలాగే, బాధిత కుటుంబానికి భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.శ్రీనివాసులు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోవడం తమకు తీరని లోటని భావోద్వేగంతో తెలిపారు. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో తమను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story