Kondabitragunta: కొండబిట్రగుంటలో 'గోపుర' శోభ.. శంకుస్థాపన చేసిన కావ్య కృష్ణారెడ్డి!
Kondabitragunta: నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పశ్చిమ గాలిగోపురానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు.
Kondabitragunta: కొండబిట్రగుంటలో 'గోపుర' శోభ.. శంకుస్థాపన చేసిన కావ్య కృష్ణారెడ్డి!
Kondabitragunta: నెల్లూరు జిల్లా,బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ని దేవస్థానంలో పశ్చిమ గాలి గోపురానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ధార్మిక సంస్థల నిర్వాహకులు అమర చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో గాలిగోపురానికి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బిల కూటము. శాప విమోచనం కోసం నారద మహర్షి తపస్సు చేసిన ఆధ్యాత్మిక కేంద్రం గా బాసిల్లు ఈ మహిమాన్విత క్షేత్రంలో ఇప్పటికే ఉత్తర దక్షిణ తూర్పు గాలిగోపురాలు ప్రాకారాలు నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఇవాళ ట్రస్టు నిర్వాహకులు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సారధ్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది.దేవస్థానం అభివృద్ధికి బచ్చు అమర ట్రస్ట్ చేస్తున్న సేవలను ఈ సందర్బంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి అభినందనలు తెలిపారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ని ఆలయంలో భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కావ్య హామీ ఇచ్చారు.
కార్యక్రమానికి స్థానిక నాయకులు, ట్రస్ట్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పశ్చిమ గాలిగోపురం నిర్మాణంతో ఆలయానికి మరింత వైభవం కలుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఇటీవల ఆలయం వద్ద నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే.
వేమిరెడ్డి ప్రశాంతిల సహకారంతో అత్యంత శోభాయమానమైన పుష్కరిణిని పూర్తి చేశారు. స్వామివారి ఉత్సవాల సందర్భంగా ప్రారంభమైన కోనేరు ఆలయానికి కొత్త శోభను తెచ్చిందని ఎమ్మెల్యే వివరించారు. నాలుగు వైపులా ప్రాకారాలు, గాలిగోపురాలు పూర్తయితే శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని ఆలయం మరింత శోభిల్లుతుందని ట్రస్టు నిర్వాహకులు చెప్పారు.




