Bhimavaram: స్టేడియంలా మారిన అంబేద్కర్‌ సెంటర్.. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ షురూ!

Bhimavaram: భీమవరంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌ను ఎమ్మెల్యే అంజిబాబు మరియు జేసీ రాహుల్ కుమార్ గాంధీ ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 March 2026 12:07 PM IST
Bhimavaram
X

Bhimavaram: స్టేడియంలా మారిన అంబేద్కర్‌ సెంటర్.. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ షురూ!

భీమవరం: ఐపీఎల్ ప్రారంభమవుతుందంటే క్రీడా అభిమానులకు పండగ వాతావరణమే మొదలవుతుందని, క్రీడా అభిమానులను థ్రిల్ అందించేందుకే ఫ్యాన్ పార్క్‌ లు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ గాంధీ అన్నారు. భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ అంబెడ్కర్ సెంటర్ రైల్వే ఆర్‌ యూబీ వద్ద భారీ ఎల్ఈ డి స్క్రీన్లు ను వారు ప్రారంభించారు.

పట్టణ ప్రజలకు వినోదాన్ని అందించడంతోపాటు సామూహికంగా క్రీడా సంబరాలను ఆస్వాదించే అవకాశాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. తెలిపారు. పట్టణ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలన్నారు. భీమవరం పట్టణంలో ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటి వినోదాత్మక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సామూహిక చైతన్యం పెంపొందుతుందనన్నారు. అధికారులు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story