Kukkunoor: ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ!
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు.
Kukkunoor: ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ!
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపిడివో సిహెచ్. నాగరాజు గౌడ్ అధ్యక్షతన 18వ విడత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ సోమవారం నిర్వహించారు.ఈ సామాజిక తనిఖీ ప్రజా దర్బార్‌కు ప్రొసీడింగ్ అధికారి ఎపిడివో శ్రీనివాసరావు పాల్గొని ఆడిట్ నిర్వహించారు. మండలంలోని 15 గ్రామ పంచాయితీల్లో 2024- 2025 సంవత్సరానికి గాను మండలంలో ఉపాధి పనులు రూ. 16 కోట్ల 16 లక్షల పనుల జరిగాయి. ఈ పనులకు గాను సామాజిక తనిఖీ నిర్వహించగా ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు నిర్లక్ష్యం వహిస్తూ రికార్డు మెయింటెనెన్స్ మాస్టర్ రూల్ పేర్లు రాయకపోవడం వంటి పొరపాటు జరగగా వీరు నుంచి రూ.1,42,300 లు రికవరీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొంతమంది కూలీలు ఉపాధి హామీ పనులకు రాకుండా వేతనాలుగా రూ.12 లక్షలు పొందారని, అభియోగాలు రావడంతో వేతనాలు పొందిన ఉపాధి కూలీలు ఉపాధి ఉనులు చేసినట్లు ఆధారాలు ఉంటే సబ్మిట్ చేయాలన్నారు.
ఉపాధి హామీ పనులు ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయని ఆడిట్లో తేడాతో రూ.14 లక్షల 56 వేల రూపాయల పనులకు సంబంధించి ఎంక్వైరీ చేశామని, ఎంక్వేరీ లో ఎంత అవినీతి జరిగిందని తెలితే వాటికి సంబంధించిన సొమ్మును రికవరీ కట్టిస్తామని,రికార్డుల విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరగగా రూ.24000 ఫైన్ విధించినట్లు తెలిపారు.అనంతరం ఏపీడిఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో వచ్చిన అభియోగాలపై పూర్తి విచారణ జరిపించి, విచారంలో అక్రమాలు జరిగితే ఉపాధి పనులకు సంబంధించిన ఆ సొమ్మును రికవరీ చేయడంతో పాటుగా సిబ్బంది పైన కూడా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎపిడివో శ్రీనివాసరావు,ఎపిడివో దామోదర్ రావు, జిల్లా విజిలెన్స్ అధికారి అనుపమణ, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి మణికంఠ, ఉపాధి హామీ సిబ్బంది, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.




