Nandyal: నంద్యాల సమీపంలో బీభత్సం.. డివైడర్ దాటి దూసుకెళ్లిన బస్సు!
Nandyal: నంద్యాల సమీపంలో చాబోలు హైవేపై మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది.
Nandyal: నంద్యాల సమీపంలో బీభత్సం.. డివైడర్ దాటి దూసుకెళ్లిన బస్సు!
Nandyal: నంద్యాల సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. చాబోలు హైవే పై తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తిరుపతి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న AP 07 TM 5719 మార్నింగ్ స్టార్ ఏసీ స్లీపర్ బస్సు ఫ్రంట్ టైరు అకస్మాత్తుగా పేలడంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను దాటి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు తీవ్రంగా కుదుపులకు గురవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో సుమారు 10 మంది ప్రయాణికులు గాయపడగా, వారిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న నంద్యాల జిల్లా పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మిగతా ప్రయాణికులను సురక్షితంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌కు పోలీస్ బస్సు ద్వారా తరలించి, వారి గమ్యస్థానాలకు పంపించే ఏర్పాట్లు చేశారు.
ఈ ప్రమాదానికి కారణమైన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.




