Nandyala: వేద మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలు చేపట్టిన నంద్యాల కలెక్టర్!

Nandyala: నంద్యాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బాధ్యతలు చేపట్టారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 4:34 PM IST
Nandyala
X

Nandyala: వేద మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలు చేపట్టిన నంద్యాల కలెక్టర్!

Nandyala: నంద్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్ పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.

బుధవారం ఆమె మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె తన ఛాంబర్‌లో రికార్డుల్లో తొలి సంతకం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజకుమారి గణియా, నంద్యాల పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. భవిష్యత్తులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో నంద్యాల‌ను ప్రథమ స్థానంలో నిలిపే దిశగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప యాదవ్, డి.ఇలు నాగభూషణ్ రెడ్డి, పవన్, రసూల్, ఏసీబీ నరసింహమూర్తి, రెవెన్యూ అధికారులు వెంకటరెడ్డి, శానిటేషన్ అధికారులు మురళి, శివప్రసాద్ రెడ్డి, లక్ష్మీనారాయణ, హిమబిందు, శశాంత్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story