సిసి కెమెరాలతో గంటల్లోనే పోగొట్టుకున్న బంగారం ఉన్న బ్యాగ్ రికవరీ!
నంద్యాల వన్ టౌన్ పోలీసుల ప్రతిభ. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గంటల్లోనే 12 తులాల బంగారం ఉన్న బ్యాగ్‌ను రికవరీ.
సిసి కెమెరాలతో గంటల్లోనే పోగొట్టుకున్న బంగారం ఉన్న బ్యాగ్ రికవరీ!
Nandyala: నంద్యాలలో వన్ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యతో పోగొట్టుకున్న బంగారం ఉన్న బ్యాగ్ కేవలం గంటల వ్యవధిలోనే బాధితులకు చేరింది. ఈ ఘటనలో సిఐ సుధాకర్ రెడ్డి తన సిబ్బంది చూపిన చాకచక్యం ప్రజల ప్రశంసలు కురిపిస్తున్నారు..
మార్చి 22 సాయంత్రం షేక్ శాలినా తన భర్త, పిల్లలతో కలిసి బైక్‌పై చాబోలు నుంచి నంద్యాల నడిగడ్డ ప్రాంతానికి వస్తున్నారు. ఈ క్రమంలో 12 తులాల బంగారం మరియు బట్టలు ఉన్న బ్యాగ్ అనుకోకుండా మార్గమధ్యలో పడిపోయింది.
ఈ విషయం గుర్తించిన బాధితులు వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారు తన సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న CC కెమెరాలను, అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫుటేజ్‌ను పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా నడిగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ ఎస్.కే. నూరుల్లా భాషా వద్ద బ్యాగ్ ఉన్నట్లు గుర్తించారు. అతన్ని విచారించగా బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించాడు.
అనంతరం బ్యాగ్‌ను ఫిర్యాదుదారుల సమక్షంలో పరిశీలించగా, అందులో ఉన్న 12 తులాల బంగారు నగలు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే బాధితులకు బ్యాగ్‌ను అప్పగించారు. తక్షణ స్పందనతో తమ విలువైన ఆస్తిని తిరిగి అందించినందుకు బాధితులు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారికి మరియు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.




