డ్రగ్స్ పై ఈగిల్ నిఘా.. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం!

Nandyala: నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా స్థాయి NCORD కమిటీ సమావేశం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 7:20 PM IST
Nandyala
X

డ్రగ్స్ పై ఈగిల్ నిఘా.. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం!

Nandyala: నంద్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని VC హాల్‌లో District Level NCORD కమిటీ సమావేశం నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం. జావళి ఆల్ఫోన్స్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎక్సైజ్, విద్య, ఆరోగ్య, వ్యవసాయం, ఫారెస్ట్, రైల్వే, బీసీ, ఎస్సీ వెల్ఫేర్, ఎండోమెంట్స్, మహిళా సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

జిల్లాను “డ్రగ్ ఫ్రీ”గా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. గంజాయి సాగు, మత్తు పదార్థాల తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై కఠిన నియంత్రణ విధించాలని నిర్ణయించారు.అనుమానాస్పద డ్రగ్స్ కార్యకలాపాలపై ప్రజలు EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు వ్యవసాయం, ఫారెస్ట్, రెవెన్యూ, ఆరోగ్య శాఖలు కలిసి పని చేయాలని తెలిపారు.గంజాయి హాట్‌స్పాట్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్‌కు బానిసైన వారికి నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స అందుబాటులో ఉందని పేర్కొన్నారు. విద్యాసంస్థల 100 మీటర్ల పరిధిలో పొగాకు విక్రయాలు జరగకుండా పర్యవేక్షణ కఠినతరం చేయాలని సూచించారు.

స్కూల్స్, కాలేజీలలో “EAGLE క్లబ్‌లు” ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డీ-అడిక్షన్ సెంటర్‌ను బలోపేతం చేసి పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మెడికల్ షాపులు చట్టపరమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అక్రమంగా NRx మందుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.ఆన్‌లైన్ ద్వారా అక్రమంగా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

డ్రగ్స్‌పై సమగ్ర పోరాటం ద్వారా నంద్యాల జిల్లాను పూర్తిగా మాదకద్రవ్యాల రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా అధికారులు స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story