Nellore: రేపు నెల్లూరులో నాన్-వెజ్ ఉండదు.. నగర కమిషనర్ కీలక ప్రకటన!

Nellore: మహావీర్ జయంతి సందర్భంగా రేపు (మార్చి 31) నెల్లూరులో మాంసం విక్రయాలు బంద్. నగర కమిషనర్ వై.ఓ. ఆనంద్ ఆదేశాల మేరకు జంతు వధశాలలు, దుకాణాలు మూసివేత.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 9:22 AM IST
Nellore
X

Nellore: రేపు నెల్లూరులో నాన్-వెజ్ ఉండదు.. నగర కమిషనర్ కీలక ప్రకటన!

Nellore: మహావీర్ జయంతి సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ కీలక ఆదేశాలు జారీ చేశారు..ఈనెల 31వ తేదీ మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని మాంసం విక్రయించే కేంద్రాలు, జంతు వధశాలలు మూసివేయాలని ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

వార్డు సచివాలయ శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు, ఈ మేరకు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని మాంసం విక్రయించే దుకాణాలు, జంతువధ శాలలు మూసివేసేలా తగిన చర్యలు తీసుకొని పర్యవేక్షించాలని ఆయన సూచించారు.. మాంసపు దుకాణదారులు ఆదేశాలను పాటించాలని... ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు నగర కమిషనర్ ఓ.వై ఆనంద్... మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు...

అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు వర్ధమాన మహావీరుడి జయంతిని పురస్కరించుకొని ఆయనను గౌరవించుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు కమిషనర్. దాదాపు 32 సంవత్సరాల పాటు అహింస పోరాటం జరిపిన మహావీరుని గుర్తు చేశారు‌ కమిషనర్ వై.ఓ. ఆనంద్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story