Nellore: నెల్లూరు నుండి జమ్మూ వరకు.. అమ్మవారి సేవలో వేమిరెడ్డి దంపతులు

Nellore: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు జమ్మూ వైష్ణోదేవి అమ్మవారికి రెండు వాహనాలు విరాళంగా ఇచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 5:24 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు నుండి జమ్మూ వరకు.. అమ్మవారి సేవలో వేమిరెడ్డి దంపతులు

Nellore: 'మాతా రాణిగా' భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందిన, జమ్మూ కాశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణోదేవి అమ్మవారికి ఎంపీ వేమిరెడ్డి దంపతుల వాహనాలు అందజేశారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు జమ్మూ లోని కాశ్మీర్ లో, త్రికూట పర్వతాలపై 5, 200 అడుగుల ఎత్తులో ఉన్న, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాతా వైష్ణోదేవి అమ్మవారికి రెండు వాహనాలను విరాళంగా ఇచ్చారు...ఈ మేరకు నేడు ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం ఆలయంలో వివిధ అవసరాల నిమిత్తం అధికారులకు రెండు వాహనాలు అందజేశారు.

ఇది త్రికూట పర్వతాలపై 5200 అడుగుల ఎత్తులో ఉన్న అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రమని, ఆదిశక్తి రూపమైన మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతుల సమ్మేళనమే ఈ అమ్మవారు అని తెలిపారు.

ఇక్కడికి వచ్చే భక్తులు కాట్రా నుండి 12 కిలోమీటర్ల కాలినడకన గాని గుర్రాల మీద గాని రావాల్సి ఉంటుందని చెప్పారు. ఏడాది పొడుగునా 24 గంటలు ఆలయ దర్శనం వుంటుందని, దర్శనార్థం వచ్చే భక్తులకు మార్చి, అక్టోబర్ నెలలు అనుకూలంగా ఉంటాయని తెలిపారు.

యాత్ర కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, మరియు హెలికాప్టర్ బుకింగ్, అధికారిక వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చునని తెలిపారు వేమిరెడ్డి దంపతులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story