Nellore: డ్రగ్స్ వద్దు బ్రో.. యువత భవిష్యత్తు కోసం పోలీసుల పోరు!
Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా "ఆపరేషన్ వజ్ర ప్రహార్" నిర్వహిస్తున్నారు.
Nellore: డ్రగ్స్ వద్దు బ్రో.. యువత భవిష్యత్తు కోసం పోలీసుల పోరు!
Nellore: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్ర ప్రహార్” లో భాగంగా జిల్లా ను “డ్రగ్ ఫ్రీ” జిల్లా గా మార్చడమే ధ్యేయంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నెల్లూరు పోలీసులు.
నెల్లూరు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS. ఆదేశాలు మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) CH.సౌజన్య సూచనల మేరకు, విస్తృతంగా స్కూల్స్, కళాశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నెల్లూరు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు, రైల్వే, ఎక్సైజ్, డ్రగ్స్ విభాగాల సమన్వయంతో “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 24 డ్రోన్లతో పర్యవేక్షిస్తూ. నెల్లూరును జల్లెడ పడుతున్న పోలీసులు.. ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే, వారిని రిహాబిటేషన్ సెంటర్ కు తరలించి, జిల్లాలో ఉన్న 2 డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు..
మాదకద్రవ్యాలు అక్రమ రవాణాతో పాటు వాడకం కూడా నేరం అని, వినియోగించే వారి పై కూడా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత భవిష్యత్తు అంధకారం అవుతోందని, సరదాగా మొదలయ్యే ఈ అలవాటు.. చివరికి బానిసగా మార్చుకుంటుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
ఈగల్ క్లబ్స్ కార్యకలాపాలు,
ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 గురించి వివరించారు. అలాగే కాలేజీ ప్రాంగణంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యానికి సూచించారు. "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదాన్ని విద్యార్థులందరి చేత చెప్పించి, ప్లకార్డులను ప్రదర్శన చేయించారు. విద్యార్థులలో మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచడం, బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు.
ఎటువంటి అసాంఘీక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిసినా, డ్రగ్స్ అమ్మినా, వినియోగించే వారి గురించి డయల్ 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు జిల్లా పోలీసు అధికారులు.




