Nellore: అమరావతిపై భయంతోనే మావిగాన్ అంటూ గావుకేకలు

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

V. Narasimhulu, Nellore
Published on: 4 April 2026 9:04 PM IST
Nellore
X

Nellore: అమరావతిపై భయంతోనే మావిగాన్ అంటూ గావుకేకలు

Nellore: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని KA పాల్ తో పోల్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.రాజకీయాల్లో వినోదాన్ని ఇచ్చేందుకు KA పాల్ ఉండగా. జగన్ తాజాగా పాల్ తో పోటీ పడుతున్నారని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. చంద్రబాబుతో పోటీ పడాల్సిన జగన్. పాల్ తో పోటీ పడుతూ అభాసుపాలు అవుతున్నారాన్నారు. రాష్ట్రానికి సీఎం గా పనిచేసిన జగన్.. రాష్ట్ర, జాతీయ మీడియా అంతా కుమ్మక్కు అయింది, అమ్ముడుపోయిందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

ఇవాళ నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఏపీకి అమరావతి లాంటి అద్భుతమైన రాజధాని వచ్చిందన్నారు.రాజధాని అభివృద్ధి చెందితే మళ్లీ కూటమే అధికారంలోకి వస్తుందని జగన్ భయపడుతున్నారని శ్రీధర్ రెడ్డి అన్నారు. సీఎం గా ఉన్నప్పుడు మూడు రాజధానులు అని మాట్లాడిన జగన్.. ఇప్పుడు మావిగాన్ అంటూ గావు కేకలు వేస్తున్నారని విమర్శించారు.

రాజధాని బిల్లుకు అన్నీ పార్టీలు మద్దతు ఇస్తే.. వైసీపీ వ్యతిరేకించడం దారుణమన్నారు.తనకి రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంలో జగన్ ఉన్నారు.మావిగాన్ మీద జగన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు.గతంలో ఎల్లో మీడియానే తిట్టే జగన్.. ఇప్పుడు అన్నీ మీడియా చానెల్స్ అమ్ముడుపోయాయని మాట్లాడుతున్నారు.ఒకప్పటి జగన్ అనుచరుడిగా ఆయనకు సలహా ఇస్తున్నా.. విచక్షణ మరిచి మాట్లాడొద్దన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story