Nellore: అనైతిక వ్యక్తికి పవిత్ర పదవా.. వైఎస్సార్‌సీపీ గర్జన!
Nellore: టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన చేపట్టింది.
Nellore: అనైతిక వ్యక్తికి పవిత్ర పదవా.. వైఎస్సార్‌సీపీ గర్జన!
Nellore: వైయస్సార్సీపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే దిశగా బిఆర్ నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు మాగుంట లేఔట్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ
తిరుమల పవిత్రత గురించి, తిరుమల తిరుపతి సంబంధించిన లడ్డు విశిష్టత గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కూడా తెలిసిందేనని, ప్రపంచంలో తిరుమల తిరుపతి గురించి ప్రతి ఒక్కరికి కూడా అదొక పవిత్ర దేవస్థానంగా అందరూ కొలిచేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, చైర్మన్ బి ఆర్ నాయుడు లాంటి వ్యక్తులు చేసే అసాంఘిక కార్యకలాపాలు అన్నీ కూడా ప్రజలు చూస్తూ వున్నారని.
ఈ క్రమంలో వైఎస్ఆర్సిపి మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే బి ఆర్ నాయుడు కి సంబంధించిన విషయాలు, చంద్రబాబు నాయుడు కి చెబుతూనే ఉన్నా, ఆయన పట్టించుకోవటం లేదని, ప్రజలకు చంద్రబాబు నాయుడు ఏం సందేశం ఇస్తున్నారు చెప్పాలని అన్నారు.
ఈ క్రమంలో అలాంటి పవిత్ర దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గా ఇలాంటి బిఆర్ నాయుడు ఉండకూడదని వైఎస్ఆర్సిపి మొదటి చెబుతోందని అన్నారు. ఆరోజు ఒక వ్యక్తి గురించి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఒక చిన్న ఆడియో బయటకు రాగానే, ఆ వ్యక్తిని బయటకు పంపినటువంటి ఘనత వైఎస్ఆర్సిపిదని గుర్తు చేశారు.
వెంటనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లాంటి వ్యక్తుల్ని పదవి నుంచి తొలగించి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పవిత్రతను కాపాడాలని ఈరోజు నెల్లూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో కూడా పూజలు చేయడం కూడా జరిగిందని చెప్పారు. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో బిఆర్ నాయుడు అనైతిక మైన వ్యక్తి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారని తెలిపారు. తప్పకుండా ఫలితం అనుభవిస్తారని చెప్పారు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
ఆరోజు ఇందులేఖ అనే మహిళ లేఖ కూడా రాసిందని, ఒకవేళ మీ గవర్నమెంట్ వస్తే ఇతనికి మాత్రం టీటీడీ చైర్మన్ లాంటి పదవి ఇవ్వద్దు అని చెప్పిందని, అయినా వినకుండా చంద్రబాబు నాయుడు పదవి కట్టబెట్టారని చెప్పారు. ఈ విధంగా టీటీడీ ప్రతిష్టను దిగజార్చుతున్న వ్యక్తి, అలాగే నైతిక విలువ లేని వ్యక్తి అయిన బీఆర్ నాయుడు అనే వ్యక్తిని ఎందుకు మీరు ఇంకా టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడుతూ :--
టిడిపి అంటే టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న పార్టీగా మారిపోయిందని. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దేవాలయాలు కూలగొట్టడమే పనిగా ఉందని, విజయవాడలో అయితే ఆ కూలకొట్టిన దేవాలయాల్ని కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ తిరిగి కట్టించడం జరిగిందని గుర్తు చేశారు. విలువలకు తిలోదకాలు ఇచ్చిన బిఆర్ నాయుడి నిజ స్వరూపం తెలిపే వీడియోస్ బయటకు వచ్చాయని, ఒక మహిళ కూడా లెటర్ రాసిందని, అతడు చాలా దుర్మార్గుడని, ఎవరైనా మహిళ పని కోసం వస్తే చాలా అసభ్యంగా మాట్లాడుతాడని ఆమె చెప్పిందని గుర్తు చేశారు.
వచ్చిన ఆడవాళ్ళని వాడుకుంటాడు అని చాలా ఘోరంగా అతను గురించి రాసిందని, అలాంటి చెడ్డ వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ గా ఎలా కొనసాగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తిని తొలగించకుండా, కొనసాగించడంతో, రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో చంద్రబాబునాయుడుకే తెలియాలని అన్నారు. ఇంకా చాలా హిందు దేవాలయాలకి తెలుగుదేశం పార్టీ చైర్మెన్ గా ఉండే వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తూ దొరుకుతున్నారని.
రీసెంట్ గా నెల్లూరు జిల్లాలోని కోదండ రామస్వామి దేవాలయం చైర్మన్ సతీష్ యాదవ్ అనే వ్యక్తి ఎంత దారుణంగా అశ్లీల నృత్యాలు చేస్తూ, డాన్సులు చేస్తూ వీడియోలు అందరూ చూశారని, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుందని చెప్పారు. ఇలాంటి వ్యక్తుల్ని ఎలా ఇంత పవిత్రమైన దేవాలయాలకు ఎలా నియమిస్తున్నారని, ఇంత దారుణంగా అనైతిక పనులు చేసే వ్యక్తుల్ని వెంటబెట్టుకుని తిప్పడం , చంద్రబాబు నాయుడు మిగతా చోట్ల పవిత్రమైన దేవస్థానాల్లో చైర్మన్ గా పని చేస్తున్న టిడిపి నేతలకు ఏం భరోసా ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు కాకాని పూజిత.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పాల్గొన్నారు.




