Kampasamudram: పాత పనులకే కొత్త మస్టర్లు.. సిబ్బంది చేతివాటం!
Kampasamudram: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుంది.
Kampasamudram: పాత పనులకే కొత్త మస్టర్లు.. సిబ్బంది చేతివాటం!
Kampasamudram: చేసిన పనినే మళ్లీ చూపిస్తూ ఫారంపొంద్ పనుల్లో అవినీతితో జేబులు నింపుకుంటున్న ఉపాధి సిబ్బంది వట్టించుకోని ఉన్నతాధికారులు.వేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు వలసలు వెళ్లకుండా స్వగ్రామా ల్లోనే వనులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి పథకం పక్కదారి వడుతోంద సగానికి పైగా చేసిన పనిని మళ్లీ చేసినట్లు చూపిస్తూ బినామీ మాస్టర్లతో ఉపాధి సిబ్బంది వారి జోబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉపాధి పనుల్లో భాగంగా ఫారంపౌండ్ లను ఏర్పాటు చేయాల్సి ఉండగా గతంలో చేసిన పనులను తిరిగి చూపిస్తూ పనులకు వెళ్లకుండానే మస్టర్లు చూపించి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దీనికి సంబంధి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రామ ఉపాధి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. ఈ తంతు మర్రిపాడు మండలంలోని కంపసముద్రం గ్రామంలో జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం కంప సముద్రంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో అవినీతి చోటు చేసుకుంది. ఉపాధి పసులకు వెళ్ళకుండానే బినామీ.మాస్టర్లతో మాయాజాలం ప్రదర్శిస్తున్నారు.
కంపసముద్రం |గ్రామంలో వర్క్ ఐడి నెంబర్ 82792లో గతంలో జరిగిన పనుల్లో భాగంగా కూలీలతో ఫారంపౌండును నిర్మించారు అయితే తిరిగి అదే ఫారంపౌండును చూపిస్తూ బినామీ మాస్టర్లతో వేలాది రూపాయలు కాజేశారని గ్రామస్తులు, ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ తంతు మార్చి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగిన పనుల్లో చోటు చేసుకుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆ పనుల్లో 10511,10776,10862 జాబ్ కార్డ్ నెంబర్లను చూపిస్తూ వేలాది రూపాయలను గ్రామంలో పనిచేసే ఉపాధి సిబ్బంది కాజేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ అండ దండలతో అధికారులను లోపరుచుకొని ఇష్టానుసారంగా బినామీ మాస్టర్లతో సొమ్మును పక్కదారి మళ్లించి అవినీతికి పాల్పడు తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి అడ్డుకట్ట వేయాలని పలువురు స్థానిక రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై హెచ్ఎంటీవీ యాప్ మర్రిపాడు ఎంపీడీవో నాగేశ్వర ప్రసాద్ ను వివరణ కోరగా అవినీతి జరిగిందని చర్చించుకుంటున్నాం అందుకు సంబంధించి గ్రామస్తులువినతి పత్రం అందజేయ లేదన్నారు. ఉపాధి పనుల్లో అవినీతి జరిగి ఉంటే తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఆ పనులకు సంబంధించి విచారణ చేపడతాం. నాగేశ్వరప్రసాద్,మర్రిపాడు ఎంపీడీవో




