Divyanga Shakti Scheme: దివ్యాంగుల సమస్యలపై ఎమ్మెల్యే జయకృష్ణ ఆత్మీయ పలకరింపు.. ఉచిత బస్సు ప్రయాణం షురూ

Divyanga Shakti Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దివ్యాంగ శక్తి' పథకం పాలకొండ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 March 2026 6:46 PM IST
Divyanga Shakti Scheme
X

Divyanga Shakti Scheme: దివ్యాంగుల సమస్యలపై ఎమ్మెల్యే జయకృష్ణ ఆత్మీయ పలకరింపు.. ఉచిత బస్సు ప్రయాణం షురూ

పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దివ్యాంగ శక్తి' పథకం పాలకొండ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. స్థానిక నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఇకపై పూర్తి ఉచిత ప్రయాణ సౌకర్యం కలగనుంది.

రాయితీ నుంచి ఉచితం వరకు:

గతంలో దివ్యాంగులు బస్సు ఛార్జీలలో 50 శాతం రాయితీతో ప్రయాణించేవారు. అయితే, వారి ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ రాయితీని 100 శాతానికి పెంచుతూ 'దివ్యాంగ శక్తి' పథకాన్ని అమలులోకి తెచ్చారు.

దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యం - ఎమ్మెల్యే జయకృష్ణ:

పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే దివ్యాంగులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే దివ్యాంగుల పింఛనును 3వేల నుండి 6వేల రూపాయలకు పెంచామని గుర్తుచేశారు.

గత మూడు నెలల బకాయిలతో కలిపి మొదటి నెలలోనే భారీ మొత్తాన్ని అందించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. దివ్యాంగుల అభ్యున్నతికి, వారి ఆర్థిక, సామాజిక వికాసానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ఆర్టీసీ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story