Palasa: ప్రతి రూపాయి ప్రజలకే అందాలి.. ఎమ్మెల్యే గౌతు శిరీష
Palasa: పలాస ఎమ్మెల్యే కార్యాలయంలో గౌతు శిరీష ఆధ్వర్యంలో “బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్" కార్యక్రమం జరిగింది.
Palasa: ప్రతి రూపాయి ప్రజలకే అందాలి.. ఎమ్మెల్యే గౌతు శిరీష
Palasa: పలాస ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నిర్వహించిన “బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్" కార్యక్రమంలో శాసనసభ్యురాలు గౌత శిరీష గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీషగారు మాట్లాడుతూ, బడ్జెట్‌లో కేటాయించే ప్రతి రూపాయిని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలని అధికారులను ఆదేశించారు.
గతంలో ఆగిపోయిన సుమారు 85 కేంద్ర పథకాలను తిరిగి ప్రారంభించామని, నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఢిల్లీలో ఒక ఐఏఎస్ అధికారి మరియు నలుగురు నిపుణులతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని, వీరు కేంద్రం నుండి రావాల్సిన ప్రతి రూపాయిని వదలకుండా ఫాలో-అప్ చేస్తారన్నారు. పారదర్శకతను పెంచడం ద్వారా బడ్జెట్‌ను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు, అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలపై పూర్తి అవగాహనను జిల్లా స్థాయి, మండల స్థాయి ప్రభుత్వ అధికారులకు మరియు ప్రజలకు చేరవేయడమే ఈ అవుట్‌రీచ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రభుత్వ ఆశయాలు ప్రతి ఇంటికి చేరేలా, అమలు ప్రక్రియను వేగవంతం చేసే దిశగా అధికారులు కృషి చేయాలని శాసనసభ్యులు వారు సూచించారు. ఈ బడ్జెట్ లో కేటాయించిన ప్రతి ఒక్క రూపాయిని సద్వినియోగం చేసుకునేటట్లు ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని నొక్కి వక్కాణించారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ వినాయక రామ్ మూడు మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలు మరియు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కమిషనర్ గారు మరియు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు మరియు సి వి ఏ పి యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.




