Palasa: నేషనల్ ఛాంపియన్ ను అభినందించిన ఎమ్మెల్యే
Palasa: మంగళూరులో జరిగిన జాతీయ స్థాయి మహిళా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పలాసకు చెందిన జరా సిద్విక్ 375 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించారు.
Palasa: నేషనల్ ఛాంపియన్ ను అభినందించిన ఎమ్మెల్యే
Palasa: ఇటీవల మంగళూరులో జరిగిన మహిళా పవర్ లిఫ్టింగ్ 69 కేజీల మహిళా విభాగం నందు 375కేజీల ఎత్తి గోల్డ్ మెడల్ సాధించిన పలాస వాసి జరా సిద్విక్ దుస్సాలువతో అభినందించారు. ఈమె భర్త పలాస ఆర్టీసీ అసిస్టెంట్ ఇంజనీర్ హేమంత్ కిషోర్ ప్రోత్సహించి జాతీయ స్థాయికి పంపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష మాట్లాడుతూ.. మహిళలు క్రీడల్లో రాణించడం అది కాకుండా పవర్ లిఫ్టింగ్ జాతీయ ,ప్రపంచ స్థాయికి పలాస నుండి వెళ్లాలని కోరారు. దీనికి కావలసిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుండి పొందేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ మరియు గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బోనెల గోపాల్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ పి విటల్, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ కుత్తుమ లక్ష్మణ్ తెలుగుదేశం యువజన నాయకులు దువ్వాడసంతోష్ నాయుడు, ఇరిగేషన్ అధికారి పి శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ జి రామ్ మోహన్ రావు, ఏపీఎస్ఆర్టీసీ దాసరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.




