Pattikonda: జై అమరావతి దీపాలతో వెలిగిపోయిన పత్తికొండ గురుకుల పాఠశాల

Pattikonda: అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలుపుతూ పత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 6:39 AM IST
Pattikonda
X

Pattikonda: జై అమరావతి దీపాలతో వెలిగిపోయిన పత్తికొండ గురుకుల పాఠశాల

Pattikonda: పత్తికొండలో అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ పత్తికొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి నాలుగు స్తంభాల కూడలి వరకు కూటమి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ..

పార్లమెంటు మరియు రాజ్యసభలో బిల్లుకు ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. అమరావతి లక్ష్య సాధనలో నారా లోకేష్ పట్టుదల ప్రశంసనీయం అన్నారు.

అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని తెలిపారు.

అలాగే, రాష్ట్ర అభివృద్ధి మరియు అమరావతి లక్ష్య సాధనలో యువ నాయకుడిగా నారా లోకేష్ చూపుతున్న చొరవ, పట్టుదల ప్రశంసనీయం తెలిపారు. అమరావతి రైతులను సమన్వయం చేస్తూ రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి చేసిన సేవలు అభినందనీయమని తెలిపారు.

అమరావతి కోసం 1631 రోజులు దీర్ఘకాలంగా పోరాడిన రైతుల త్యాగాలు, వారి కన్నీళ్ళే ఈ విజయానికి మూల కారణమని అభినందించారు.

ఈ చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు. అనంతరం కూటమి నాయకులు స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్యాపిలి రోడ్డు నందు గల అంబేత్కర్ బాలికల గురుకుల పాఠశాల యందు బాలికలు దీపాలతో ఏర్పాటు

అమరావతి మన రాజధాని తిలకించి అక్కడ జై అమరావతి జై జై అమరావతి అని నినాదాలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story