Ugadi Kalaratna Award 2026: కళకు దక్కిన గౌరవం 2026 ఉగాది పురస్కార గ్రహీత పిరియా చలపతిరావు

Ugadi Kalaratna Award 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 ఉగాది పురస్కారాల్లో భాగంగా కవిటి మండలానికి చెందిన పిరియా చలపతిరావుకు 'కళారత్న (హంస)' అవార్డును ప్రకటించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 March 2026 8:07 PM IST
Ugadi Kalaratna Award 2026
X

Ugadi Kalaratna Award 2026: కళకు దక్కిన గౌరవం 2026 ఉగాది పురస్కార గ్రహీత పిరియా చలపతిరావు

కవిటి, శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంక ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన ఉగాది పురస్కారాల్లో, కవిటి మండలం బి. గొనపుట్టగ గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు పిరియా చలపతిరావును ప్రతిష్ఠాత్మక ‘కళారత్న (హంస)’ అవార్డు వరించింది.

కళారంగంలో విశిష్ట సేవలు:

చలపతిరావు గత కొంతకాలంగా కళారంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను, ఆయన ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారానికి ఆయన్ను ఎంపిక చేసింది. కళల పట్ల ఆయనకున్న అంకితభావానికి ఈ అవార్డు నిదర్శనమని సాంస్కృతిక రంగ నిపుణులు కొనియాడారు.

వెల్లువెత్తుతున్న అభినందనలు:

తమ ప్రాంత వ్యక్తికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించడం పట్ల బొరివంక మరియు బి. గొనపుట్టగ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీవీ రమణ, పుల్లట రాజు, నాగరాజు తదితర ప్రముఖులతో పాటు, ఆయన అభిమానులు చలపతిరావును స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story